కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను: హైపర్ ఆది
- కాలేజ్ డేస్ లో బాగా సందడి చేసేవాడిని
- నేను కాలేజ్ కి వెళ్లకపోతే ఫ్రెండ్స్ బోర్ ఫీలయ్యేవారు
- పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాను
'ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? లవ్ మ్యారేజ్ చేసుకుంటారా?' అనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ .. 'ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు .. పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకుంటాను. నాకు కాబోయే భార్యను ఎంపిక చేసే అవకాశం వాళ్లకి ఇవ్వాలని అనుకుంటున్నాను. కాలేజ్ డేస్ లోను ఒక అమ్మాయినే ఎక్కువగా చూసేవాడిని .. ఆ అమ్మాయినే బాగా ఇష్టపడేవాడిని. పేరు చెప్పకూడదు .. ఆ అమ్మాయికి పెళ్లైపోయింది' అంటూ నవ్వేశాడు.