పంచ్ ఫార్మేట్ ను అందుకే ఎంచుకున్నాను: హైపర్ ఆది
- ముందు నుంచే 'జబర్దస్త్' చూసేవాడిని
- పంచ్ లకి ప్రేక్షకులు బాగా నవ్వడం గమనించాను
- ఆ పంచ్ లకే ప్రాధాన్యతనిచ్చాను
" నేను బీటెక్ చదువుతూ ఉండగా .. ' జబర్దస్త్' చూసేవాడిని. స్టేజ్ పై డ్రామా నడుస్తూ ఉండగా పంచ్ రాగానే ప్రేక్షకులు నవ్వుకునేవారు. ఆ స్టేజ్ పై అడుగుపెట్టే అవకాశం నాకు వచ్చాక, డ్రామా ఎక్కువగా చేయకుండా, ప్రేక్షకులు ఎదురుచూసే పంచ్ లతోనే మొత్తం ఎపిసోడ్ నడిపించాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి అదే ఫార్మేట్ ను అనుసరిస్తూ వెళుతున్నాను. అదే నాకంటూ ఓ ప్రత్యేకతను తీసుకు వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.