గోవాలో కొత్త సంవత్స‌ర వేడుక‌లు జ‌రుపుకున్న రాహుల్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవాలో కొత్త సంవత్స‌ర వేడుక‌లు జ‌రుపుకున్న రాహుల్‌

  • త‌ల్లితో క‌లిసి న్యూఇయ‌ర్ వేడుక‌లు
  • ద‌క్షిణ గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్లో సెల‌బ్రేష‌న్‌
  • వెల్ల‌డించిన కాంగ్రెస్ ప్ర‌తినిధి
కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను తల్లి సోనియా గాంధీతో క‌లిసి గోవాలో జ‌రుపుకున్నట్లు తెలుస్తోంది. అధ్య‌క్ష బాధ్య‌త‌లు రాహుల్‌కి అప్ప‌గించిన త‌ర్వాత సోనియా గాంధీ గోవాలో సేద‌దీరుతున్న సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణ గోవాలోని మోబోర్ ప్రాంతంలో ఉన్న ఫైవ్ స్టార్ హోట‌ల్లో వీరిరువురూ, కొంత‌మంది బంధువుల స‌మ‌క్షంలో న్యూఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. ఈ వేడుక‌కు పార్టీ త‌ర‌ఫున ఎవ‌రూ హాజ‌రుకాలేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.
new year
rahul
goa
sonia

More Telugu News