'హాథీ మేరా సాథీ' అంటున్న భల్లాల దేవుడు... ఫస్ట్‌లుక్ చూడండి!
- బందేవ్ పాత్రలో నటిస్తున్న రానా
- హిందీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం
- తెలుగు వెర్షన్ కు 'అడవి రాముడు' టైటిల్
తమిళ దర్శకుడు ప్రభు సోలొమాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1971లో రాజేశ్ ఖన్నా హీరోగా వచ్చిన చిత్రానికి ఇది రీమేక్. అయినప్పటికీ ఇందులో చాలా కొత్త అంశాలుంటాయని, నిజజీవిత సంఘటనల ఆధారంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు 'అడవి రాముడు' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు సమాచారం.