రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గాయ్!

  • వివో వి7, మోటొరోలా జీ5ఎస్ ప్లస్
  • వీటి ధరల్ని రూ.2,000 వరకు తగ్గించిన కంపెనీలు
  • వివో వి7 కొత్త ధర రూ.16,990
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల దిగ్గజాల్లో ఒకటైన వివో వి7 స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించింది. 24 మెగా పిక్సల్స్ సెల్ఫీ కెమెరాతో ఈ నెల ఆరంభంలో ఇది దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. నెలలోనే దీని ధరను కంపెనీ తగ్గించడం విశేషం. ఆరంభంలో రూ.18,990 ధరకు విడుదల చేయగా, తాజాగా దీని ధరను రూ.2,000 మేర కంపెనీ తగ్గించింది. దీంతో రూ.16,990కు దిగొచ్చింది.

 మరో ప్రముఖ కంపెనీ మోటరోలా సైతం మోటో జీ5 ఎస్ ప్లస్ ధరను తగ్గించింది. ఈ ఏడాది ఆగస్ట్ లో స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ గా దీన్ని రూ.15,999 ధరకు మోటరోలా దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తాజాగా రూ.1,000 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్ అమేజాన్, మోటొరోలా స్టోర్లలోనే అందుబాటులో ఉంటుంది. మోటరోలా కంపెనీ లెనోవా సొంతమని తెలిసిందే.
Go Back to Shorts
smartphone prices

More Telugu News