హైదరాబాద్ యువతకు మెట్రో తీపి కబురు.. నేటి అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు
- కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న యువత
- అర్ధరాత్రి వరకు సేవలను పొడిగించిన మెట్రో అధికారులు
- ఆదివారం కావడంతో ఉదయం నుంచే యువత బిజీబిజీ
అర్ధ రాత్రి వరకు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని ఇంటికెళ్లే వారు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో తన సేవలను పొడిగించింది. నేటి అర్ధరాత్రి దాటాక రెండు గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. సాధారణ సమయాల్లో ఉదయం 5 నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే నడిచే రైళ్ల సమయాన్ని ఆదివారం పొడిగించినట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.