టీమిండియాకు ఆదిలోనే సమస్యలు.. తొలి టెస్టుకు దూరమైన ధావన్
- కాలి గాయం నుంచి కోలుకోని ధావన్
- తొలి టెస్టుకు దూరం పెట్టిన మేనేజ్ మెంట్
- కోహ్లీ అసంతృప్తి
జనవరి 5 నుంచి భారత్-దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టు జరగనుంది. కేప్ టౌన్ ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ధావన్ కాలి గాయం నేపథ్యంలో, ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లు బరిలోకి దిగనున్నారు. మరోవైపు, టెస్టుకు ధావన్ దూరం కావడం పట్ల కెప్టెన్ కోహ్లీ కూడా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.