పోలవరం కష్టమే... నిర్మాణ సంస్థ ట్రాన్స్ ట్రాయ్ దివాలా!

30-12-2017 Sat 09:24 | Both States
  • ఏపీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ
  • ఆగిపోనున్న కాంట్రాక్టు పనులు
  • కెనరా బ్యాంకుకు రూ. 725 కోట్లు బకాయి పడ్డ ట్రాన్స్ ట్రాయ్
  • ఇన్ సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని నేషనల్ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన బ్యాంకు
2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి కనీసం గ్రావిటీ ద్వారా నీరందించాలని ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ పై కెనరా బ్యాంకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు దివాలా పిటిషన్ ను దాఖలు చేసింది. ఆ సంస్థ తమకు రూ. 725 కోట్లు బకాయి పడిందని, వెంటనే కార్పొరేట్ ఇన్ సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టి తమ బకాయిలు ఇప్పించాలని కోరింది. తమకు డిసెంబర్ 22 నాటికి రూ. 489 కోట్లు చెల్లించాల్సివుందని, ఆ మొత్తం కట్టడంలో సంస్థ విఫలమైందని పేర్కొంది.

మొత్తం  ప్రాజెక్టు భవిష్యత్తుపై ఆందోళన కలిగించేలా కెనరా బ్యాంకు తీసుకున్న ఈ చర్యతో ఏపీ ప్రభుత్వం సైతం డోలాయమానంలో పడింది. ఒకవేళ నేషనల్ లా ట్రైబ్యునల్, ట్రాన్స్ ట్రాయ్ ని దివాలా తీసిన సంస్థగా ప్రకటిస్తే, పోలవరం పనులు ఎక్కడివక్కడ నిలిచే ప్రమాదం ఉంది. తిరిగి కాంట్రాక్టులను పిలవాల్సిందే. ట్రాన్స్ ట్రాయ్ కి మరే బ్యాంకు నుంచి అప్పు పుట్టదు. ప్రాజెక్టుకు కీలకమైన కాంక్రీటు పనులు క్లిష్టతరమవుతాయి. స్లిప్ వే, స్పిల్ చానల్ పనులు సాగవు.

అయితే, ఈ పరిస్థితిని చంద్రబాబునాయుడు ముందే గ్రహించి, కొత్త టెండర్లను పిలిచారని, అయితే, కేంద్ర జలవనరుల శాఖ అడ్డు పడి, ఆ ప్రక్రియను నిలిపేసిందని ఏపీ అధికారులు అంటున్నారు. వాస్తవానికి తదుపరి వర్షాకాల సీజన్ లో గోదావరికి వరదలు వచ్చే సరికి స్పిల్ వేను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, అదిప్పుడు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
PolavaramTranstraiChandrababuAndhra Pradesh

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more