Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైద‌రాబాద్ వాతావ‌ర‌ణం కాఫీలా ఉంది: సినీన‌టుడు రాజ్‌త‌రుణ్‌

  • ఒక్కోసారి చాలా వేడిగా ఉంటుంది
  • ఒక్కోసారి చాలా చ‌ల్ల‌గా ఉంటుంది
  • నేను కొంచం బిజీగా ఉన్నాను
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. ట్విట్ట‌ర్‌లో త‌న అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఖాళీ స‌మ‌యాల్లో జ‌వాబులు ఇస్తుంటాడు. కాస్త స‌మ‌యం దొర‌క‌డంతో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణం గురించి రాజ్ త‌రుణ్ ఓ ట్వీట్ చేశాడు. హైద‌రాబాద్ వాతావ‌ర‌ణం కాఫీలా ఉంద‌ని అన్నాడు. ఒక్కోసారి చాలా వేడిగా ఉంటుంద‌ని, ఒక్కోసారి చాలా చ‌ల్ల‌గా ఉంటుంద‌ని అన్నాడు.
 
కాగా, 'అన్నా చాలా బిజీ అయిపోయావా.. ఏంటీ?' అంటూ ఓ అభిమాని ట్వీట్ చేయ‌గా, 'కొంచెం బిజీ బ్రో' అంటూ రాజ్ త‌రుణ్ రిప్లై ఇచ్చాడు. 'నెక్స్ట్ సినిమా ఎక్క‌డ భ‌య్య?' అంటూ మ‌రో అభిమాని ట్వీట్ చేయ‌గా 'చిన్న స‌ర్‌ప్రైజ్ భ‌య్యా.. చాలా త్వ‌ర‌లో చెబుతా' అని చెప్పాడు. 
raj tarun
Hyderabad
weather

More Telugu News