హైదరాబాదులో ఆదివారం నుంచి విధుల్లోకి 'రోబో పోలీస్'

  • చరిత్రలో ఇది రెండో రోబో పోలీస్
  • ఆదివారం నుంచి విధులు ప్రారంభం
  • దుబాయ్ లో ఇప్పటికే రోబో పోలీస్ విధులు
హైదరాబాదులో రోబో పోలీసు విధులను నిర్వర్తించనుంది. ఈ రోబో పోలీస్ ప్రజలను పలకరిస్తుంది, గుర్తు పడుతుంది, ఫిర్యాదులను కూడా వింటుంది. ప్రపంచంలో విధులు నిర్వహిస్తున్న రెండో రోబో పోలీసుగా ఇది చరిత్రకెక్కనుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో ఆదివారం నుంచి ఈ రోబో విధులను ప్రారంభించనుంది.

హైదరాబాదులోని టీహబ్ లో స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన హెచ్ బోట్స్ రోబోటిక్స్ కంపెనీ ఈ రోబో పోలీసును రూపొందించింది. దుబాయ్ లో ఇప్పటికే చక్రాలపై కదిలే రోబో పోలీసు విధులను నిర్వహిస్తోంది. మన హైదరాబాద్ రోబో పోలీసు దీనికి భిన్నమైంది. చక్రాల మీద కాకుండా, ఇది కదులుతుంది.
Go Back to Shorts
robot police
hyderabad robot police

More Telugu News