Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ వయసులో నేను కలెక్టర్‌ను కొట్టాను.. మీరూ అలాగే చేయండి!: ఆర్.కృష్ణయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

  • బీసీ విద్యార్థి సంఘం సభలో వ్యాఖ్యలు
  • చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్
  • విద్యార్థులకు అన్యాయం జరిగితే బాగుండదని హెచ్చరిక
బీసీ సంక్షేమ సంఘం నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం మీ వయసులో ఉన్నప్పుడు ఒక్కడినే పోరాడానని, ఓ సందర్భంలో అడ్డొచ్చిన కలెక్టర్‌పై చేయి చేసుకున్నానని, ఆర్డీవో కార్యాలయాలకు తాళాలు వేశానని, మీరు కూడా అలాగే చేయాలని పిలుపు నిచ్చారు.

విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రతి ఏటా ఫీజులు పెంచుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, దీనిపై ప్రభుత్వ నియంత్రణ కరువైందని విమర్శించారు. సాఫ్ట్ స్కిల్స్‌పై విద్యార్థులకు ప్రభుత్వం రెండేళ్లపాటు ఉచిత శిక్షణ ఇవ్వాలన్నారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ  ఊరుకోబోనని కృష్ణయ్య హెచ్చరించారు.
TTelugudesam
R.Krishnaiah
MLA

More Telugu News