మరింత పెరిగిన బంగారం ధర!

  • రూ.175 పెరిగిన బంగారం ధ‌ర
  • ఈ రోజు రూ.30,250గా ప‌ది గ్రాముల‌ పసిడి ధ‌ర‌
  • వెండి ధ‌ర‌ కేజీకి రూ.250 పెరిగి రూ.39,500గా న‌మోదు
బంగారం ధ‌ర మళ్లీ పైపైకి వెళుతోంది. నిన్న‌ 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి, రూ.30,075గా నమోద‌యి మూడు వారాల గరిష్ఠానికి చేరిన విష‌యం తెలిసిందే. అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ఈ రోజు కూడా బంగారం ధ‌ర పది గ్రాములకు రూ.175 పెరిగి రూ.30,250గా న‌మోదైంది.

కాగా, వెండి ధ‌ర కూడా కేజీకి రూ.250 పెరిగి రూ.39,500కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.
Go Back to Shorts
gold
rate
silver

More Telugu News