ప్రియుడితో కలసి.. పెంపుడు తల్లిని హతమార్చిన ఏడో తరగతి బాలిక!
- ప్రేమ వ్యవహారమే కారణం
- 15 ఏళ్ల స్నేహితుడి సాయంతో హత్య
- ఆ తరువాత డ్రామా ఆడిన వైనం
- ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఘటన
ఈ విషయం ఆమె పెంపుడు తల్లికి తెలియడంతో ప్రేమగీమ వద్దంటూ హెచ్చరించింది. దీంతో తన పెంపుడు తల్లిపై ఆగ్రహం తెచ్చుకున్న ఆ బాలిక తన స్నేహితుడిని రాత్రి సమయంలో ఇంటికి పిలిపించి, అతడితో కలిసి గొంతు నులిమి హతమార్చింది. అనంతరం తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని, స్పృహ తప్పి పడిపోయిందని అందరినీ నమ్మించింది. వైద్యుడు ఆ ఇంటికి వచ్చి అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పి వెళ్లిపోయాడు.
అయితే, అంత్యక్రియలు జరిపే సమయంలో మృతదేహం గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు ఆ బాలికను విచారించగా అసలు విషయాన్ని తెలిపింది. ఇద్దరు పిల్లలనూ అరెస్టు చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించి ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.