భర్త గురించి వివరాలను తెలిపిన నటి, యాంకర్ హరి తేజ!
- బెంగుళూరులో సీనియర్ సైంటిస్ట్ గా పని చేస్తున్నారు
- ఆయన వైపు నుంచి అరేంజ్డ్ మ్యారేజ్.. నా వైపు నుంచి లవ్ మ్యారేజ్
- షూటింగులు లేనప్పుడు బెంగుళూరు వెళ్తా
తన భర్త దీపక్ బెంగుళూరులో ఉంటారని... సీనియర్ సైంటిస్టుగా పని చేస్తున్నారని తెలిపింది. ఆయన వైపు నుంచి తమది అరేంజ్డ్ మ్యారేజ్ అని, తన వైపు నుంచి లవ్ మ్యారేజ్ అని చెప్పింది. ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తన భర్త తనతో సరదాగా అంటుంటారని తెలిపింది. తనకు షూటింగులు లేనప్పుడు బెంగుళూరు వెళతానని... షూటింగ్ ఉందని ఫోన్ రాగానే పెట్టేబేడా సర్దుకుని తిరిగి వస్తానని చెప్పింది.