Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిల్ మూడవ సినిమా.. తెరపైకి మెర్సల్ దర్శకుడి పేరు!

  • అఖిల్ మూడవ సినిమాకి కసరత్తు 
  • మాస్ కంటెంట్ ఉండాలనేది నాగ్ అభిప్రాయం 
  • జనవరి 10న వివరాల వెల్లడి 
అఖిల్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హలో' సినిమా యూత్ ను ఆకట్టుకుంటోంది. అయితే అక్కినేని అభిమానులు ఈ సినిమా విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదనే టాక్ వినిపిస్తోంది. అఖిల్ మూడవ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన 3వ సినిమాకి సంబంధించిన వివరాలను జనవరి 10న వెల్లడిస్తానని అఖిల్ చెప్పాడు.

అఖిల్ చేయనున్న దర్శకుల జాబితాలో కొరటాల .. బోయపాటి .. సుకుమార్ ఉండగా, తాజాగా 'మెర్సల్' దర్శకుడు అట్లీ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. అట్లీకుమార్ ఇటీవల చేసిన 'మెర్సెల్' వసూళ్ల పరంగా ఎంతగా దుమ్ము రేపేసిందో తెలిసిందే. 'హలో' సినిమాతో యూత్ కి చేరువైన అఖిల్ ను .. తదుపరి సినిమాతో మాస్ ఆడియన్స్ కి దగ్గర చేయాలనే ఉద్దేశంతో నాగ్ వున్నాడట. అందువలన ఆయన అట్లీ కుమార్ పై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అట్లీ కుమార్ ..ప్రభాస్ ను రంగంలోకి దింపనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అఖిల్ మూడవ సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తుండటం విశేషం.  
akhil
Nagarjuna

More Telugu News