రూ. 17,999కే ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ.. ప్రత్యేక సేల్ నడుపుతున్న అమెజాన్
- ఈ ఫోన్ అధికారిక ధర రూ. 26,000
- దాదాపు రూ. 8000లు తగ్గింపు
- అమెజాన్ ఛాయిస్‌లో భాగంగా అమ్మకాలు
రోస్‌గోల్డ్, స్పేస్ గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఫోన్ సైజు చిన్నగా ఉండి, అత్యుత్తమ పనితీరు కావాలనుకునే వారు ఈ ఫోన్‌ను ఎక్కువగా ఆదరిస్తారు. ఇటీవల దిగుమతి పన్ను పెరిగినపుడు ఐఫోన్ల ధరలను ఆపిల్ పెంచింది. అలాంటి సమయంలో కూడా ఇంత తక్కువ ధరకు అమెజాన్ విక్రయాలు చేపడుతుండటం నిజంగా విశేషమేనని టెక్ గురులు అభిప్రాయపడుతున్నారు.