'మనవరాలితో మా నాన్నగారు' అంటూ ఫొటో పోస్ట్ చేసిన నటుడు శ్రీనివాస్ రెడ్డి

  • ఇటీవ‌ల ఓ పాప‌కు జ‌న్మినిచ్చారు
  • ట్వీట్ చేసిన నటుడు
  • ఇప్ప‌టికే వారికి ఓ పాప‌
క‌మెడియ‌న్‌గా మంచి పేరు సంపాదించుకుని, ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన శ్రీనివాస్  రెడ్డి ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల శ్రీనివాస్ రెడ్డి భార్య స్వాతిరెడ్డి ఓ పాప‌కు జ‌న్మినిచ్చారు. ఆ విష‌యాన్ని చెబుతూ, ఇద్ద‌రు కూతుళ్ల‌తో దిగిన ఫొటోను శ్రీనివాసరెడ్డి సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'మనవరాలుతో నాన్నగారు' అంటూ తన తండ్రి దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు శ్రీనివాసరెడ్డి.
Go Back to Shorts
srinivasreddy
cinema

More Telugu News