పిచ్చోళ్లా కనపడుతున్నామా?.. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు: రవిశాస్త్రి

  • ధోనీలో ఉన్న వేగం, ఫిట్ నెస్ అమోఘం
  • 36 ఏళ్ల వయసులో మీరు ఎలాంటి క్రికెట్ ఆడారు?
  • ధోనీలో ఉన్న లక్షణాలు మార్కెట్లో దొరికేవి కాదు
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఈ వయసులో కూడా అద్భుత ప్రతిభతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. 2019 ప్రపంచ కప్ లో వికెట్ కీపర్ రేసులో ధోనీదే మొదటి స్థానం అంటూ ఛీప్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ డైరెక్ట్ గా చెప్పాడంటే... జట్టుకు ధోనీ అవసరం ఎంత ఉందో అర్థమవుతుంది. అయితే, ఇదే సమయంలో ధోనీపై క్రిటిక్స్ విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి. 36 ఏళ్ల ధోనీ జట్టులో అవసరమా? అంటూ విమర్శిస్తున్నారు.

ఈ విమర్శలపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మండిపడ్డాడు. ధోనీ వయసు 36 ఏళ్లు అయినప్పటికీ... అతనికన్నా పదేళ్ల చిన్నవారైన ఆటగాళ్లకంటే చాలా ఫిట్ గా, వేగంగా ఉన్నాడని చెప్పాడు. "మేమేం పిచ్చోళ్లం కాదు. గత 30 నుంచి 40 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నా. కోహ్లీ కేవలం పదేళ్ల నుంచే క్రికెట్ లో ఉన్నాడు. 26 ఏళ్ల వయసున్న ఆటగాడిని కూడా ధోనీ చిత్తు చేయగలడు.

 విమర్శలు గుప్పిస్తున్న వారికి ఒకటే సూచన చేస్తున్నా. 36 ఏళ్ల వయసులో వారు ఎంత వరకు క్రికెట్ ఆడగలిగారు? ఒక రెండు పరుగులైనా వేగంగా పరుగెత్తగలిగారా? మీరు రెండు రన్స్ చేసే లోపు, ధోనీ మూడు పరుగులు చేయగలడు. ప్రస్తుత క్రికెట్ లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అత్యున్నత క్రికెటర్లలో ధోనీ ఒక్కడు. ధోనీలో ఉన్న గొప్ప లక్షణాలు మార్కెట్ లో దొరికేవి కావు. మీరు వాటిని ఎక్కడా కొనలేరు. పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఆపేయండి" అంటూ శాస్త్రి విమర్శకులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 
Go Back to Shorts
MS Dhoni
ravi shastri
team india
kohli

More Telugu News