ట్రంప్ పాల్గొన్న విందులో కాల్పులు.. అదే హోటల్‌లో కేఏ పాల్.. ఆయన ఏమన్నారంటే..!
- వాషింగ్టన్‌లో ట్రంప్ పాల్గొన్న విందు వద్ద కాల్పుల కలకలం
- దుండగుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
- సంఘటన జరిగిన హోటల్‌లోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
- వీడియో సందేశం ద్వారా వివరాలు వెల్లడించిన పాల్
- ప్రపంచంలో శాంతి కరువైందని ఆవేదన వ్యక్తం చేసిన కేఏ పాల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఓ కార్యక్రమం వద్ద కాల్పులు జరగడం కలకలం రేపింది. వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఆ హోటల్‌లోనే ఉండటం గమనార్హం.
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వార్షిక విందు సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఓ వ్యక్తి తుపాకీతో హోటల్‌లోకి ప్రవేశించి, విందు జరుగుతున్న హాల్ బయట కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఈ ఘటన జరిగిన సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని కేఏ పాల్ స్వయంగా వెల్లడించారు. హిల్టన్ హోటల్ నుంచే ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "గంట, రెండు గంటల క్రితం అధ్యక్షుడు ట్రంప్‌పై ఓ షూటర్ దాడికి ప్రయత్నించాడు. ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది. లోపలికి రావాలంటే చాలా చెకింగ్స్ ఉంటాయి. అలాంటిది అధ్యక్షుడు లోపల ఉండగా షూటర్ ఎలా వచ్చాడు?" అని పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ప్రపంచంలో శాంతి కరవైందని, యుద్ధాలు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.