Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకే సంవ‌త్స‌రంలో ఆరు స‌క్సెస్‌లు సాధించ‌డం దిల్ రాజుకే చెల్లింది!: అల్లు అర్జున్

  • హైద‌రాబాద్‌లో దిల్ రాజు స‌క్సెస్ జ‌ర్నీ ప్రోగ్రాం
  • హాజ‌రైన సినీ ప్ర‌ముఖులు
  • శ‌తమానం భ‌వతి, నేను లోక‌ల్‌, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసీఏ సినిమాలు విజ‌య‌వంతం
ఒకే సంవ‌త్స‌రంలో ఆరు స‌క్సెస్‌లు సాధించ‌డం దిల్ రాజుకే చెల్లిందని సినీన‌టుడు అల్లు అర్జున్ అన్నాడు. ఈ రోజు హైద‌రాబాద్‌లో దిల్ రాజు స‌క్సెస్ జ‌ర్నీ పేరుతో వేడుక జ‌రుపుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్‌కి ప‌లువురు సినీ ప్రముఖులు హాజ‌రై దిల్ రాజుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. శ‌త మానం భ‌వతి, నేను లోక‌ల్‌, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసీఏ సినిమాలు మంచి విజ‌యం సాధించాయ‌ని, ఆయా సినిమాల కోసం ప‌నిచేసిన అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు తెలిపారు. దిల్ రాజుకి ఈ స‌క్సెస్ ఊరికే రాలేద‌ని అన్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సినిమాలు ప్రారంభం అయ్యేట‌ప్పుడు శ్రీ అనిత స‌మ‌ర్పించు అని క‌న‌ప‌డుతుంద‌ని అన్నారు. ఆమె మృతితో దిల్ రాజు ఎంతో బాధ‌ను కూడా అనుభ‌వించార‌ని అన్నారు. దిల్‌రాజు ఎంతో క‌ష్ట‌ప‌డ‌తార‌ని చెప్పారు.  
Dil Raju
Allu Arjun
cinema

More Telugu News