'హలో' హీరోయిన్ కి 'ఐ హేట్ యూ' అంటూ మెసేజ్ లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'హలో' హీరోయిన్ కి 'ఐ హేట్ యూ' అంటూ మెసేజ్ లు!

  • 'హలో'తో ఆకట్టుకున్న కల్యాణి 
  • యూత్ మనసుల్లో చోటు 
  • ఆమె పైనే దర్శక నిర్మాతల దృష్టి  
అఖిల్ హీరోగా ఈ నెల 22వ తేదీన 'హలో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో అఖిల్ సరసన మెరిసిన ఈ అమ్మాయికి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో అంతా "కల్యాణి.. ఐ హేట్ యూ" అంటూ వరుసగా మెసేజ్ లు పెట్టేస్తున్నారట.

ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారం 'ఐ లవ్ యూ' అంటే .. ఎవరెస్టు అంత ప్రేమ .. 'ఐ హేట్ యూ' అంటే ఆకాశమంత ప్రేమ. ఎవరెస్టుకి ఒక పరిధి అనేది వుంది .. కానీ ఆకాశానికి లేదు. అందువలన ఈ సినిమా కాన్సెప్ట్ ను దృష్టిలో పెట్టుకుని అంతా ఆమెకి 'ఐ హేట్ యూ' అంటూ మెసేజ్ లు చేస్తున్నారట. ఇక ఈ అమ్మాయికి పెరుగుతోన్న క్రేజ్ ను చూసిన దర్శక నిర్మాతలు .. తమ తరువాత సినిమాల్లో కథానాయికగా ఆమెను తీసుకునే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారని తెలుస్తోంది. చూస్తుంటే 'హలో'తో కల్యాణి ఇక్కడ తన హవాను మొదలెట్టేలానే వుంది.      
kalyani
akhil

More Telugu News