Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీని హాలీవుడ్ సినిమాతో పోల్చిన రాహుల్ గాంధీ

  • 'లై హార్డ్' అంటూ 'డై హార్డ్' సినిమాతో పోలిక‌
  • బీజేపీది అబద్ధాల పునాది అని వ్యాఖ్య‌
  • గుజ‌రాత్‌లో ప‌ర్య‌టిస్తున్న‌కాంగ్రెస్ అధ్యక్షుడు
గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా అక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. ఇవాళ ఉద‌యం గుజ‌రాత్ చేరుకున్న రాహుల్‌ సోమ్‌నాథ్ దేవాల‌యం సంద‌ర్శించి పూజ‌లు నిర్వ‌హించారు. కొత్త‌గా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో రాహుల్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ బీజేపీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

అలాగే ట్విట్ట‌ర్‌లో బీజేపీ హామీల‌ను, పార్టీ నిర్మాణాన్ని హాలీవుడ్ సినిమా 'డై హార్డ్' పేరు గుర్తుకు వచ్చేలా పోల్చారు. ‘ఒకవేళ బీజేపీ వారు సినిమా ఫ్రాంఛైజీ తీసుకుంటే దాన్ని కచ్చితంగా లై హార్డ్‌ అని పిలవాలి’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. శుక్ర‌వారం రోజు జ‌రిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌ను ఇలా ట్వీట్ రూపంలో పోస్ట్ చేశారు. భాజపా నిర్మాణం, పునాదులు అబద్ధాలపై ఏర్పడ్డాయని, ప్రధాని మోదీ చెబుతున్న గుజరాత్‌ నమూనా అంతా అబద్ధమని వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో రాహుల్ విమ‌ర్శించారు.
rahul gandhi
bjp
lie hard
die hard

More Telugu News