Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను .. అమలను సర్ ప్రైజ్ చేద్దామని చెప్పలేదట!: అఖిల్ పాట గురించి నాగ్

  • ఇంట్లో అఖిల్ ఎప్పుడూ విజిల్ కూడా వేసి ఎరుగడు
  • ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఓ పాట వినిపించాడు 
  • పాట వినగానే అనూప్ రూబెన్స్ కి ఫోన్ చేశాను  
అఖిల్ రెండవ సినిమాగా 'హలో' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తాజాగా నాగార్జున చెప్పారు. ఈ సందర్భంలోనే ఆయన ఈ సినిమాలో అఖిల్ పాడిన పాటను గురించిన ప్రస్తావన తీసుకొచ్చారు.

 "చిన్నప్పటి నుంచి అఖిల్ ను చూస్తున్నాం .. ఎప్పుడూ ఇంట్లో విజిల్ వేసింది కూడా లేదు. అలాంటి అఖిల్ ఒకరోజు నా దగ్గరికి వచ్చి .. 'నాన్నా, 'హలో' కోసం ఒక పాట తయారైంది వినండి' అన్నాడు. విన్న తరువాత 'అచ్చం నీ గొంతు మాదిరిగానే వుంది కదరా" అన్నాను .. అంతే నవ్వేశాడు. నిజంగా నాకు అది ఓ పెద్ద సర్ ప్రైజ్. వెంటనే అనూప్ రూబెన్స్ కి ఫోన్ చేసి మూడు నెలలుగా మీరు చేస్తోన్న పని ఇదా? " అని అడిగాను. "మిమ్మల్ని .. అమల గారిని సర్ ప్రైజ్ చేద్దామని చెప్పలేదు" అన్నాడు. ఆ పాట విన్న తరువాత నిజంగానే నేను చాలా థ్రిల్ ఫీలయ్యాను" అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.   
nagarjuna
akhil

More Telugu News