భూమిక నాకు సొంత వదినలా మారిపోయింది!: నాని
- భూమిక పేరు వినగానే చాలా ఎగ్జైట్ అయ్యా
- 'ఖుషీ' సినిమా సందర్భంగా పోలీసులతో తన్నులు తిన్నా
- మా అబ్బాయికి కూడా బొమ్మలు కొని తెచ్చేవారు
పవన్ కల్యాణ్, భూమిక నటించిన 'ఖుషీ' సినిమా టికెట్స్ కోసం లైన్ లో నిలబడకుండా... వేరే లైన్ ను క్రియేట్ చేసినందుకు పోలీసులు తనను చితక్కొట్టారని తెలిపాడు. షూటింగ్ సందర్భంగా ఈ విషయాన్ని భూమికకు చెప్పానని... దాంతో, ఆమె నవ్వుకున్నారని చెప్పాడు. షూటింగ్ సందర్భంగా ఆమె తనకు చాలా దగ్గరయ్యారని... సినిమా పూర్తయ్యేలోపు ఆవిడ తనకు సొంత వదినలా మారిపోయారని తెలిపాడు. వాళ్లబ్బాయి కోసం షాపింగ్ చేసేటప్పుడు, మా అబ్బాయికి కూడా బొమ్మలు కొని తెచ్చేవారని చెప్పాడు.