తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పిన భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పిన భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!

  • తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు చెప్పింది
  • రెండేళ్లు స్నేహితుల్లా ఉందామంది
  • నా చావుకు ఆమే కారణం
  • పది పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొన్న భర్త
భార్య పెట్టే ఇబ్బందులు భరించలేని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. హరియాణాలోని పానిపట్‌లో జరిగిందీ ఘటన. తన చావుకు భార్యే కారణమని, ఆమె వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి ప్రాణం తీసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పానిపట్‌కు చెందిన సాహిల్-శివానీలు ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. ఆరు నెలల పాటు సంసారం సాఫీగా సాగిన తర్వాత విభేదాలు మొదలయ్యాయి. దీంతో శివానీ జమ్ముకశ్మీర్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సాహిల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు ముందు సాహిల్ పది పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అందులో.. శివానీ వేరొకరిని ప్రేమిస్తున్నట్టు చెప్పిందని, అతడితోనే తాను ఉంటానని చెప్పిందని పేర్కొన్నాడు. అప్పటి వరకు రెండేళ్లపాటు ఇద్దరం స్నేహితులుగా ఉందామని పేర్కొందని రాశాడు. సూసైడ్ నోట్ ప్రారంభంలోనే ‘శివానీ కిల్ మీ’ అని రాశాడు. తన ఉద్యోగాన్ని, డబ్బులను సోదరుడికి ఇవ్వాలని లేఖలో అభ్యర్థించిన సాహిల్, తాను తిరిగి జన్మిస్తానని తల్లిని ఉద్దేశిస్తూ పేర్కొన్నాడు. శివానీకి ఏమీ దక్కకూడదని, వారి కుటుంబానికి శిక్ష పడేలా చూడాలని అభ్యర్థించాడు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Suicide
Haryana
wife
India

More Telugu News