Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పరిస్థితులు కఠినంగా మారాయంటూ.. దక్షిణ కొరియా పాప్‌స్టార్‌ కిమ్‌ జోంగ్‌ హ్యున్ ఆత్మహత్య!

  • హోటల్‌ రూంలో ఓ బొగ్గులాంటి పదార్థాన్ని కాల్చి ఆ పొగ పీల్చి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
  • ఇదే త‌న చివ‌రి ఫేర్‌వెల్ అని సోద‌రికి మెసేజ్
  • కిమ్‌ (27)కి చిన్న వ‌య‌సులోనే ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు
హోటల్‌ రూంలో ఓ బొగ్గులాంటి పదార్థాన్ని కాల్చి ఆ పొగ పీల్చి దక్షిణ కొరియా పాప్‌స్టార్‌ కిమ్‌ జోంగ్‌ హ్యున్ (27) ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఇదే త‌న చివ‌రి ఫేర్‌వెల్ అని, పరిస్థితులు కఠినంగా మారాయని, త‌న‌ను వెళ్లనివ్వాలంటూ త‌న సోద‌రికి మెసేజ్‌లు సెండ్ చేసి జోంగ్ హ్యున్ ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడు. మెసేజ్‌లు వ‌చ్చిన అనంత‌రం కిమ్‌ సోదరి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

పోలీసులు హోటల్‌కి వెళ్లి అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ మ‌ధ్యంలోనే మృతి చెందాడు. ఆ దేశంలో ఇదే రకంగా ఆత్మహత్యలు చేసుకుంటోన్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. పాప్‌స్టార్‌ కిమ్‌ జోంగ్‌ హ్యున్ చిన్న వ‌య‌సులోనే ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయ‌న ఇటువంటి ఘ‌ట‌న‌కు ఎందుకు పాల్ప‌డ్డాడ‌న్న విష‌యం ఇంకా తెలియ‌రాలేదు. రెండేళ్ల క్రితం కిమ్‌ విడుదల చేసిన ఆల్బమ్‌ బిల్‌బోర్డ్‌ వరల్డ్‌ ఆల్బమ్స్‌ చార్ట్‌లో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఇటీవ‌ల కూడా ఎంతో హుషారుగా ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాడు.
suicide
pop star
kim jong

More Telugu News