లైకులు, షేర్లు అడిగే పోస్టులపై చర్యలు తీసుకోనున్న ఫేస్బుక్
- తప్పుదోవ పట్టించే పోస్టులను కట్టడి చేసేందుకే నిర్ణయం
- సమాజానికి ఉపయోగపడే పోస్టులకు మినహాయింపు
- రెండు వారాల్లో అమల్లోకి
ఇలాంటి పోస్టులను గుర్తించడానికి ఓ మెషీన్ లాంగ్వేజ్‌ను ఫేస్బుక్ రూపొందించింది. తప్పుదోవ పట్టించే పోస్టులు చేసే పేజీలను తాత్కాలికంగా నిలిపేవేసేలా ఈ లాంగ్వేజ్‌ను తయారుచేశారు. అయితే రక్తదానం, తప్పిపోయిన పిల్లల సమాచారం వంటి సమాజానికి ఉపయోగపడే పోస్టులకు మినహాయింపు కల్పించింది. రెండు వారాల్లో ఈ నిబంధనలను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.