డిసెంబర్ 20న షియోమీ నెం.1 ఎమ్ఐ ఫ్యాన్ సేల్... రెడ్మీ మొబైళ్లపై భారీ డిస్కౌంట్లు!
- రూ. 1కే స్మార్ట్ఫోన్లు, యాక్సెసరీస్
- రూ. 32,999కే ఎమ్ఐ మిక్స్2
- రెండ్రోజుల పాటు జరగనున్న సేల్
రూ. 35,999 విలువ గల షియోమీ ఎమ్ఐ మిక్స్ 2 ఫోన్‌ను రూ. 32,999కి అందజేయనుంది. అలాగే రెడ్మీ 4, రెడ్మీ నోట్4, రెడ్మీ వై1 లైట్, ఎరుపు రంగు రెడ్మీ ఎమ్ఐ ఏ1, రెడ్మీ 5ఏ ఫోన్లపై కూడా డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఎంత డిస్కౌంట్, ఏ మోడల్‌ను అందజేయనున్నారనే సంగతిని మాత్రం వెల్లడించలేదు. రివార్డు ఎమ్ఐ యూజర్లకు మంగళవారం మధ్యాహ్నం 12గం.ల నుంచే ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. కేవలం స్మార్ట్ఫోన్ల మీదే కాకుండా షియోమీ వారి యాక్సెసరీలను కూడా తక్కువ రేటుకి అందించనుంది.