Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంగ్రాట్స్ బీజేపీ, కాంగ్రెస్‌, మోదీ: కేటీఆర్‌

  • ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా దూసుకుపోతోన్న బీజేపీ
  • గట్టిగా పోటీనిచ్చిన కాంగ్రెస్‌
  • ప్ర‌జాస్వామ్యానికి స్థిర‌మైన ప్ర‌భుత్వం అవ‌స‌రం
  • అలాగే ఉత్సాహ‌వంత‌మైన ప్ర‌తిప‌క్షం కూడా అవ‌స‌రం-కేటీఆర్‌
గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్నందుకు బీజేపీకి, న‌రేంద్ర మోదీకి శుభాకాంక్ష‌లు అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే, గ‌ట్టిగా పోటీనిచ్చిన కాంగ్రెస్‌కి కూడా శుభాకాంక్ష‌ల‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యానికి స్థిర‌మైన ప్ర‌భుత్వం, ఉత్సాహవంత‌మైన‌ ప్ర‌తిప‌క్షం అవ‌స‌ర‌మ‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, గుజ‌రాత్‌లో ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డిన ఫలితాల్లో బీజేపీ 89 స్థానాల్లో గెలిచి 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ‌రో మూడు స్థానాల్లో గెలిస్తే మ్యాజిక్ ఫిగ‌ర్ 92ను చేరుకుంటుంది. అదే రాష్ట్రంలో కాంగ్రెస్ 66 స్థానాల్లో గెలిచి 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  
KTR
BJP
Congress

More Telugu News