Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భారతీయుడు 2' నిర్మించాలనే ఆలోచనను విరమించుకున్నాను: దిల్ రాజు

  • వచ్చే ఏడాది నిర్మాతగా మూడు సినిమాలు
  • వీటిలో ఒకటి 'మల్టీ స్టారర్'
  • ఇద్దరు నూతన దర్శకులతో రెండు కొత్త ప్రాజెక్టులు
తెలుగులోని అగ్రనిర్మాతలలోను .. డిస్ట్రిబ్యూటర్ల జాబితాలోను దిల్ రాజు కనిపిస్తారు. మాస్ .. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే కథలను ఎంపిక చేసుకోవడంలోనూ, వరుస విజయాలను అందుకోవడంలోను ఆయన ముందుంటారు. అలాంటి దిల్ రాజు పుట్టినరోజు నేడు .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన దగ్గర సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లంతా సంతోషంగా ఉండేలా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పారు.

 ప్రయోగాత్మక సినిమాలు చేయాలని ఉన్నప్పటికీ .. పెట్టుబడి వెనక్కి రావడం లేదని అన్నారు. వచ్చే ఏడాది వంశీ పైడిపల్లి - మహేశ్ సినిమా.. శర్వానంద్ - నితిన్ లతో 'దాగుడు మూతలు' ..  నితిన్ తో 'శ్రీనివాస కల్యాణం' చేయనున్నట్టుగా చెప్పారు. వచ్చే ఏడాది ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేయనున్నానని అన్నారు. ఇక శంకర్ తో 'భారతీయుడు 2' సినిమాను నిర్మించాలనుకున్నాననీ, అయితే సన్నిహితులు వారించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నానని చెప్పుకొచ్చారు.  
Dil Raju

More Telugu News