జియో ఖాతాదారులకు శుభవార్త.. ఇక కంప్యూటర్లోనూ జియో టీవీ!
- జియో టీవీ, సినిమా యాప్‌లకు వెబ్ వెర్షన్లు
- ఇకపై కంప్యూటర్ తెరపైనా సినిమాలు
- ఖాతాదారుల అభ్యర్థన మేరకు ప్రవేశపెట్టిన జియో
జియో టీవీలో తెలుగు, హిందీ సహా 550 లైవ్ చానల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి యాప్స్ రూపంగా ఉండడంతో వెబ్ వెర్షన్ తీసుకొస్తే బాగుంటుందని వినియోగదారుల నుంచి అభ్యర్థనలు వెళ్లాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న జియో వినియోగదారులకు మరింతగా చేరువ కావాలంటే వెబ్ వెర్షన్లు కూడా ఉండాలని భావించి వెబ్ వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.