డిసెంబర్ మా ఫ్యామిలీకి కలిసొచ్చే నెల: నాగార్జున
- సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు
- 'హలో'ను అప్పుడు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు
- అందుకే డిసెంబర్ 22న ఫిక్స్ చేశాం
- ఈ నెల మాకు సెంటిమెంట్ కూడా
'హలో'తో పాటు నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' కూడా వస్తోంది. ఇదేదో కాంపిటేషన్ అని కొంతమంది అంటున్నారు.. నేనలా భావించడం లేదు. ఎందుకంటే సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చినా ఆడేస్తున్నాయి .. అలాంటిది ఇప్పుడు రెండు సినిమాలు రావడం వలన పెద్దగా సమస్య ఉండదనేది నా ఉద్దేశం. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి. అందువలన థియేటర్లు దొరకడం కష్టమైపోతుంది. అలాంటి స్టార్ హీరోల సినిమాలతో అఖిల్ పోటీ పడటం ఇప్పుడు వాడికి అంత మంచిది కాదు. 'హలో'ను సంక్రాంతికి విడుదల చేయకపోవడానికి ఇది కూడా ఒక కారణం" అని చెప్పుకొచ్చారు.