Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగ్ .. నాని సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!

  • నాగ్ .. నానిలతో మల్టీ స్టారర్ 
  • వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాణం 
  • ఫిబ్రవరి నెలలో షూటింగ్ మొదలు        
నాగార్జున .. నాని కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందా అనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఆ నెల నుంచే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేస్తారట.

 కొంతకాలంగా కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకుండా చైతూ .. అఖిల్ సినిమాలపై నాగార్జున శ్రద్ధ పెడుతూ వచ్చారు. ఇక నాని కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. నాగ్ నిర్మించిన 'హలో' .. నాని చేసిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఈ నెలలో విడుదల కానున్నాయి. ఆ తరువాత నానికి వేరే ప్రాజెక్టులు ఉన్నప్పటికీ వాటితో పాటు ఆయన నాగ్ తో చేసే మల్టీ స్టారర్ పై దృష్టి పెట్టనున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో ఈ బ్యానర్లో నాగ్ 'గోవిందా గోవిందా' .. 'రావోయి చందమామ' .. 'ఆజాద్' సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.          
nagarjuna
nani

More Telugu News