రాజ‌కీయాల నుంచి సోనియా గాంధీ త‌ప్పుకోవ‌డం లేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ‌కీయాల నుంచి సోనియా గాంధీ త‌ప్పుకోవ‌డం లేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌!

  • సోనియా రాజ‌కీయ జీవితంపై మొద‌లైన చ‌ర్చ‌
  • పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి మాత్రమే రిటైర్‌ అవుతున్నారు
  • రాజకీయాల నుంచి కాదు- కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాల్‌
రేపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విని స్వీక‌రించ‌నున్న‌ నేప‌థ్యంలో సోనియా గాంధీ రాజ‌కీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ వ‌స్తోన్న వార్త‌ల‌ను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. రాహుల్‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించిన త‌రువాత పార్టీలో ఎటువంటి పాత్ర పోషిస్తార‌ని సోనియా గాంధీని తాజాగా విలేక‌రులు అడ‌గ‌గా.. 'విర‌మ‌ణే నా ప‌ని' అని ఆమె స‌మాధానం ఇచ్చారు.

దీంతో సోనియా గాంధీ రాజ‌కీయాల నుంచి తప్పుకుంటున్న‌ట్లు ఒక్కసారిగా వార్త‌లు వచ్చేశాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాయ‌బ‌రేలి నుంచి ఇక ఆమె పోటీ చేస్తారా? లేదా? అన్న విష‌యంపై చ‌ర్చ కొన‌సాగుతోంది.

ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాల్‌ స్పందిస్తూ.. సోనియా గాం‍ధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి మాత్రమే రిటైర్‌ అవుతున్నారని, రాజకీయాలనుంచి కాదని ట్విట్ట‌ర్‌లో పేర్కొని స్ప‌ష్ట‌తనిచ్చారు. ఆమె మేధ‌స్సు, ఆశీస్సులు పార్టీకి ఎప్పటికీ అవసరమని అన్నారు. 
Sonia gandhi
politics
Congress

More Telugu News