భారీ సినిమాకి దర్శకుడిగా ధనుష్ .. హీరోగానూ ఆయనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ సినిమాకి దర్శకుడిగా ధనుష్ .. హీరోగానూ ఆయనే!

  • హీరోగా రెండు సినిమాలతో బిజీ 
  • నిర్మాతగా 'కాలా' సినిమా పనులు 
  • ఇవి పూర్తికాగానే కొత్త ప్రాజెక్టుపై దృష్టి  
కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ధనుష్ పేరు తప్పకుండా కనిపిస్తుంది. నటుడిగానే కాకుండా, దర్శక నిర్మాతగాను ఆయన సక్సెస్ అయ్యాడు. సింగర్ గాను శభాష్ అనిపించుకున్నాడు. ఆ మధ్య ఆయన దర్శకత్వం వహించిన 'పా పాండి' సినిమా ఆయనకి విజయాన్ని అందించింది. దర్శకుడిగా ఆయన అభిరుచికి ప్రశంసలను తెచ్చిపెట్టింది.

ఇప్పుడు మరోసారి ఆయన అలాంటి ప్రయత్నమే చేయనున్నాడు. శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తోన్న ఒక సినిమాలో తానే హీరోగా నటిస్తూ .. దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. స్వాతంత్ర్యం రావడానికి ముందు జరిగే పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. ప్రస్తుతం రజనీతో 'కాలా' సినిమాను నిర్మిస్తోన్న ధనుష్, గౌతమ్ మీనన్ .. వెట్రిమారన్ దర్శకత్వంలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. 
dhanush

More Telugu News