మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ పోరాడుతున్న 80 ఏళ్ల సుబ్బమ్మ మృతి!
- సుబ్బమ్మ నేతృత్వంలో ఏకమైన మహిళలు
- 80 ఏళ్ల వయసులో మద్యానికి వ్యతిరేకంగా పోరాటం
- దిగొచ్చిన అధికారులు.. అంతలోనే గుండెపోటుతో మృతి
అయినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రెండు రోజుల క్రితం 20 మంది మహిళలు గ్రామంలోని చెరువులోకి దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్పందించిన అధికారులు గురువారం గ్రామ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో పాల్గొనకుండానే సుబ్బమ్మ మృతి చెందారు. సభకు హాజరుకావడానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. 80 ఏళ్ల వయసులో మహిళల్లో చైతన్యం నింపి మద్యానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆమె మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.