Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి త‌ర్వాత మొద‌టిసారి ట్విట్ట‌ర్ ఓపెన్ చేసిన అనుష్క‌... ప్ర‌తిఒక్క‌రికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు

  • థ్యాంక్యూ పోస్టుల‌తో నిండిపోయిన అనుష్క ట్విట్ట‌ర్ పేజీ
  • ఎవ‌రికి వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు
  • 60 మంది ప్ర‌ముఖుల‌కు రిప్లై ట్వీట్‌
అనుష్క - విరాట్‌ల పెళ్లి సంద‌ర్భంగా అటు క్రికెట‌ర్లు, ఇటు బాలీవుడ్ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో విషెస్ వెల్లువ కురిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే వారందరికీ పేరుపేరున అనుష్క శ‌ర్మ‌ రిప్లై ఇచ్చింది. పెళ్లి త‌ర్వాత మొద‌టిసారి ట్విట్ట‌ర్ ఓపెన్ చేసిన అనుష్క దాదాపు 60 మంది ప్ర‌ముఖుల‌కు ట్వీట్ రిప్లై ఇచ్చింది. దీంతో అనుష్క ట్విట్ట‌ర్ పేజీ థ్యాంక్యూ పోస్టుల‌తో నిండిపోయింది. ఆమె కేవ‌లం కాపీ పేస్ట్ చేసి రిప్లై ఇవ్వ‌కుండా, ప్ర‌తి ఒక్క‌రినీ ప్ర‌త్యేకంగా సంబోధిస్తూ రిప్లై ఇచ్చింది. ఒక్క‌సారి అనుష్క ట్విట్ట‌ర్ పేజీ చూస్తే ఎవ‌రికి వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపిన విధానం గ‌మ‌నించ‌వ‌చ్చు.
Anushka Sharma
Virat Kohli
twitter
wishes

More Telugu News