రాప్తాడు మండలంలో ముగిసిన జగన్ పాదయాత్ర.. హైదరాబాద్ పయనం
- ముగిసిన 35వ రోజు పాదయాత్ర
- నేడు 11.1 కిలోమీటర్ల యాత్ర
- రేపు కోర్టుకు హాజరుకానున్న జగన్
ఈనాటి పాదయాత్ర సందర్భంగా జగన్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు కలిశారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థి జేఏసీ డిసెంబర్ 20న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తోందని... ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఛలో ఢిల్లీ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు ఇదే అంశంపై గళం వినిపించనున్నారని చెప్పారు.