అంతా స్వాతి ప్లానే... నాకేం తెలియదు!: రాజేష్
- ఆమె చెప్పినట్టు చేశాను
- తమ విషయం భర్తకు తెలిసిందని చెప్పింది కూడా స్వాతియే
- నిజ నిర్ధారణ కోసం కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు
ఈ ఉదయం అపోలో ఆసుపత్రిలో రాజేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయన్ను నాగర్ కర్నూలు తరలించి విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు రాజేష్ చెప్పిన విషయాలపై నిజనిర్ధారణ కోసం కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం రాజేష్ ను తీసుకుని మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి క్రైమ్ సీన్ ను రీక్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. రాజేష్ చెప్పిన వివరాలను, గత నాలుగు రోజులుగా స్వాతి చెప్పిన వివరాలను పోల్చి చార్జ్ షీట్ తయారు చేస్తామని నాగర్ కర్నూల్ పోలీసులు తెలిపారు.