సినిమావాళ్లు వస్తే తరిమికొట్టండి!: జగన్

  • మీ ముందుకు వస్తున్న సినీ నటులను నిలదీయండి
  • సినిమా యాక్టర్లను పక్కన పెట్టుకోవడం బాబుకు అలవాటే
  • అమరావతిపై రాజమౌళి సినిమా తీయాలి
సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను పక్కన పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనని వైసీపీ అధినేత జగన్ వ్యంగ్యంగా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీ ముందుకు వస్తున్న సినీ నటులను నిలదీయాలంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ ను విమర్శించారు. చంద్రబాబు పాలన అంతా అబద్ధాలు, మోసాలతో కొనసాగుతోందని అన్నారు. మనలో చైతన్యం రావాలని, అప్పుడు చంద్రబాబులాంటి వాళ్లు బంగాళాఖాతంలో కలసిపోతారని చెప్పారు.

తాను చాలా కష్టపడుతున్నా, కేంద్రమే సహకరించడం లేదని చంద్రబాబు చెబుతుంటారని అన్నారు. ఏమీ చేయకపోయినా, అన్నీ చేసినట్టు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని కూడా అమరావతికి పిలిపించుకున్నారని... ఒక్క ఇటుక కూడా పడని అమరావతిపై ఆయన సినిమా తీయాలని అన్నారు. అందులో తన పాత్రను, మంత్రి నారాయణ పాత్రను బాగా చూపించాలని అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jagan
Chandrababu
ss rajamouli
amaravathi

More Telugu News