ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హాలీవుడ్ నటి నకిలీ పోర్న్ వీడియో!
- నెట్లో ప్రత్యక్షమైన 'వండర్ ఉమెన్' చిత్ర నటి గాల్ గడోట్ వీడియో
- మెషీన్ లెర్నింగ్ ద్వారా వీడియో సృష్టి
- మితిమీరితే ప్రమాదమంటున్న నిపుణులు
వండర్ ఉమెన్ చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్న గాల్ గడోట్ వీడియో నకిలీదని నిపుణులు వెంటనే తేల్చశారు. అయితే ఇలాంటి వీడియోలు రూపొందించేవారు కేవలం సెలెబ్రిటీలకు మాత్రమే పరిమితమవరని భవిష్యత్తులో సాధారణ జనాన్ని కూడా వీరు టార్గెట్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ అదే గానీ జరిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనర్థాలకు కారణభూతంగా నిలిచే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.