ధోనీ, పాండ్యాల మధ్య 100 మీ.ల పరుగు పందెం... గెలుపు సీనియర్‌దే!
- శ్రీలంకతో రెండో వన్డేకు ముందు ప్రాక్టీస్‌లో వీడియో
- పోస్ట్ చేసిన బీసీసీఐ
- ఆల్వేస్ ఫిట్ అని మరోసారి నిరూపించిన ధోనీ
పరుగు ప్రారంభంలో హార్దిక్, ధోనీని దాటినట్లు అనిపించినప్పటికీ చివరికి వచ్చేసరికి ధోనీ ముందుండటం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ధోనీని దాటడానికి హార్దిక్ తీవ్రంగా ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. 36 ఏళ్ల ధోనీ, 24 ఏళ్ల ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను గెలవడం చూసిన అభిమానులు ధోనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.