Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హుక్కా తాగుతున్న ఫొటో పెట్టిన రవీంద్ర జడేజా... విమర్శించిన నెటిజన్లు

  • ఆద‌ర్శంగా తీసుకునేవారు అడ్డ‌దారి తొక్కుతార‌ని ఉవాచ‌
  • ఇలాంటి ఫొటోలు పెట్టొద్ద‌ని విజ్ఞ‌ప్తి
  • జ‌డేజాకు మ‌ద్దతు ప‌లికిన కొంత‌మంది
భార‌త జ‌ట్టు ఆట‌గాడు ర‌వీంద్ర జ‌డేజా నిన్న త‌న ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫొటో పెట్టాడు. త‌న ఫామ్‌హౌస్‌లో సేద తీరుతూ, హుక్కా తాగుతున్న ఫొటోను అత‌ను షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌నాత్మ‌క కామెంట్లు చేశారు. ఎంతో మంది చిన్నారులు జ‌డేజాను ఆద‌ర్శంగా తీసుకుంటున్నార‌ని, ఇలాంటి ఫొటోలు పెట్ట‌డం కార‌ణంగా వారు అడ్డ‌దారులు తొక్కే అవ‌కాశాలున్నాయ‌ని హిత‌బోధ చేశారు.

సెలెబ్రిటీ అన్నాక కొన్ని నిబంధ‌న‌లు పాటించాల‌ని, ఇలాంటి ఫొటోలకు పిల్ల‌లు సుల‌భంగా ఆక‌ర్షితుల‌వుతార‌ని మ‌రికొంత‌మంది నెటిజ‌న్లు విమ‌ర్శించారు. వారి జీవితాల‌ను ప్ర‌భావితం చేసే ఫొటోల‌ను పెట్టొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అయితే మ‌రికొంత‌మంది నెటిజ‌న్లు మాత్రం జ‌డేజాకు మ‌ద్ద‌తుగా కామెంట్లు చేశారు. సెలెబ్రిటీల‌కు కూడా వ్య‌క్తిగ‌త జీవితం ఉంటుంద‌ని, వారి జీవితాన్ని వారికి న‌చ్చిన‌ విధంగా అనుభ‌వించే హ‌క్కు వారికి ఉంద‌ని మ‌ద్ద‌తిచ్చారు.
hukkah
Ravindra Jadeja
instagram

More Telugu News