క్రిస్మస్ ఈవెంట్‌కి హాజరైన మహారాష్ట్ర సీఎం భార్య... విరుచుకుపడిన నెటిజన్లు
- 'హిందువై ఉండి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తావా?' అంటూ విమర్శలు
- గట్టిగా సమాధానం చెప్పిన అమృతా ఫడ్నవీస్
- సమాజానికి ఉపయోగపడే పనికి మతం రంగు పులమొద్దని వ్యాఖ్య
అయితే ఈ ఫొటోలపై నెటిజన్లు మరోలా స్పందించారు. హిందువై ఉండి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తావా? అంటూ విమర్శించారు. అలా విమర్శించిన వారిలో జర్నలిస్టులు కూడా ఉండటం గమనార్హం. వీరందరికీ అమృతా ఫడ్నవీస్ గట్టిగా సమాధానం చెప్పారు. సమాజానికి ఉపయోగపడే పనికి ఇలా మతం రంగు పులమడం సబబు కాదని వ్యాఖ్యానించారు. తాను ఆ కార్యక్రమానికి హాజరయ్యేముందు బహుమతులు అందుకోనున్న పేదపిల్లల ముఖాలే కనిపించాయని, వారి కోసమే ఈ వేడుకకు హాజరైనట్లు తెలిపారు.