విరుష్క పెళ్లి వేడుక‌లో నోరూరించిన రుచులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విరుష్క పెళ్లి వేడుక‌లో నోరూరించిన రుచులు!

  • చెఫ్ రీతూ దాల్మియాకు కేటరింగ్  
  • ఇటాలియ‌న్‌, భార‌త వంట‌కాల స‌మ్మేళ‌నం
  • డిసెంబ‌ర్ 21న న్యూఢిల్లీలో రిసెప్ష‌న్‌
పెళ్లి అన‌గానే మొద‌ట గుర్తొచ్చేది భోజ‌నాలే.. విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌ల పెళ్లి వేడుక కూడా ఇందుకు అతీతం కాదు. అందుకే అతిథుల‌కు నోరూరించే వంట‌కాల‌ను పెళ్లివేడుక‌లో ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇట‌లీలోని ట‌స్క‌నీ ప్రాంతంలో ఉన్న బోర్జో ఫిన‌చీతో రిసార్ట్‌లో జ‌రిగిన వీరి పెళ్లి కేట‌రింగ్‌ను ప్ర‌ముఖ చెఫ్ రీతూ దాల్మియాకు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం.

చిత్తామ‌ణి రెస్టారెంట్‌ను న‌డుపుతున్న రీతూ దాల్మియా కొన్ని ప్ర‌త్యేక వంట‌ల‌ను విరుష్క పెళ్లి వేడుక‌లో త‌యారుచేయించింద‌ట‌. ఇటాలియ‌న్‌, భార‌త వంట‌కాల స‌మ్మేళ‌నంగా కొన్ని కొత్త రుచుల‌ను అతిథుల‌కు ప‌రిచ‌యం చేసింద‌ట‌. పోర్చినీ మ‌ష్‌రూమ్స్‌, బిక‌నీర్ రోటీ, రావియోలీ, ప‌నీర్ కుర్చ‌న్ వంటి వంట‌లు అతిథుల నోరూరించిన‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 21న న్యూఢిల్లీలోని తాజ్ డిప్ల‌మాటిక్ ఎన్‌క్లేవ్‌లో వీరి రిసెప్ష‌న్ వేడుక జ‌ర‌గ‌నుంది. అలాగే ముంబైలో కూడా బాలీవుడ్ తార‌ల‌కు ప్ర‌త్యేకంగా రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
virushka
Virat Kohli
Anushka Sharma
italy
marriage

More Telugu News