Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్కతో డేటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి కోహ్లీ కెరీర్ గ్రాఫ్ ఎలా పెరిగిందంటే..!

  • తార స్థాయికి చేరుకున్న కోహ్లీ గ్రాఫ్
  • ఎన్నో రికార్డులు బద్దలు 
  • 36 సెంచరీలు బాదాడు
టీమిండియా కెప్టెన్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ప్రేమాయణం గురించి చాలా కాలంగా వార్తలు వెల్లువెత్తుతున్నా, వారు మాత్రం తమ అనుబంధం గురించి ఏనాడూ స్పష్టత ఇవ్వలేదు. అయినా, సోషల్ మీడియాలో మాత్రం వీరి లవ్ ఎఫైర్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే వచ్చాయి. వీరిద్దరికీ 2013లో పరిచయం ఏర్పడింది. ఓ కమర్షియల్ షూట్ సందర్భంగా వీరు కలుసుకున్నారు. 2014 నుంచి డేటింగ్ చేశారు. అనుష్కతో డేటింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత కోహ్లీ కెరీర్ గ్రాఫ్ ఉన్నత శిఖరాలకు చేరుకుంది. తాను చేసిన 52 సెంచరీలలో 36 సెంచరీలను అనుష్కతో ప్రేమాయణం మొదలుపెట్టిన తర్వాతే కోహ్లీ చేశాడు. ఇందులో 17 టెస్ట్ శతకాలు, 19 వన్డే సెంచరీలు ఉన్నాయి.

వరుసగా అత్యధిక సిరీస్ లను గెలుచుకున్న కెప్టెన్ గా ఆస్ట్రేలియా మాజీ సారథి రికీపాంటింగ్ పేరు మీద ఉన్న రికార్డును ఇటీవలే కోహ్లీ సమం చేశాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ను గెలిచిన తరుణంలో ఈ మైలురాయిని అందుకున్నాడు. గత రెండేళ్లలో బ్యాట్స్ మెన్ గా కోహ్లీ అత్యుత్తమ క్రికెట్ ఆడాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఏకంగా 610 పరుగులు సాధించాడు. కెప్టెన్ గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డును కోహ్లీ ఈ ఏడాది బద్దలు కొట్టాడు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది 11 సెంచరీల సాయంతో 2818 పరుగులను కోహ్లీ సాధించాడు.
Virat Kohli
Anushka Sharma
team india
bollywood
kohli career graph

More Telugu News