Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటి నుంచి దంప‌తులు.. త‌మ పెళ్లి ఫొటోల‌ను పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క‌

  • ఇట‌లీలో ముగిసిన వివాహం
  • త‌మ‌ ట్విట్ట‌ర్ ఖాతాల్లో పోస్ట్ చేసి స‌ర్ ప్రైజ్ ఇచ్చిన సెల‌బ్రిటీలు
  • హుషారుగా క‌న‌ప‌డుతోన్న పెళ్లికొడుకు, పెళ్లికూతురు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ వివాహ బంధంతో ఒక్క‌టయ్యారు. వారిరువురూ ఇటలీకి వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచి ఇరువురు సెల‌ట్రిటీలు త‌మ పెళ్లి ఫొటోల‌ను త‌మ‌ ట్విట్ట‌ర్ ఖాతాల్లో పోస్ట్ చేసి స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. త‌మ‌ పెళ్లిపై వ‌స్తోన్న వార్త‌ల‌పై అస్సలు స్పందించని కోహ్లీ, అనుష్క శ‌ర్మ ఒక్క‌సారిగా త‌మ పెళ్లి ఫొటోల‌ను పోస్ట్ చేశారు. వారిరువురికీ శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో హుషారుగా క‌న‌ప‌డుతోన్న పెళ్లికొడుకు, పెళ్లికూతురి ఫొటోలను మీరూ చూడండి...    
Anushka Sharma
Virat Kohli
marriage

More Telugu News