కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లి.. కాసేపట్లో అధికారిక ప్రకటన?
- ఇటలీలో పెళ్లి
- ఇంతవరకు రాని అధికారిక ప్రకటన
- పెళ్లి విషయంపై కోహ్లీ లేక అనుష్క శర్మ కుటుంబ సభ్యులు ప్రకటన చేసే అవకాశం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వివాహ బంధంతో ఒక్కటి కావడానికి ఇటలీకి వెళ్లిన విషయం తెలిసిందే. వారి పెళ్లి జరిగినట్లు తెలిసింది. ఈ విషయంపై మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం. ఇటలీలో వారసత్వ కట్టడంగా పేరొందిన చారిత్రక ప్రదేశం బోర్గో ఫినోచీటోలో వీరు పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. కాగా, కోహ్లీ, అనుష్కల రిసెప్షన్ ఇండియాలోనే జరగనున్నట్లు సమాచారం. తమ పెళ్లిపై వస్తోన్న వార్తలపై కోహ్లీ, అనుష్క శర్మ ఇంతవరకు స్పందించలేదు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సమాచారాన్ని చెప్పడానికి ఇష్టపడడం లేదు. వీరి పెళ్లిపై కోహ్లీ లేక అనుష్క శర్మ కుటుంబ సభ్యులు కాసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది.