రాహుల్‌గాంధీ ఎన్నిక ప‌ట్ల ర‌ఘువీరారెడ్డి హ‌ర్షం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్‌గాంధీ ఎన్నిక ప‌ట్ల ర‌ఘువీరారెడ్డి హ‌ర్షం!

  • 2019లో కాబోయే ప్ర‌ధాని రాహుల్ గాంధీయే
  • గాంధీ, నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన 5వ వ్య‌క్తి
  • దేశానికి రాహుల్ సేవ‌లు అవ‌స‌రం
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా రాహుల్‌గాంధీ ఏక‌గ్రీవంగా ఎన్నిక కావ‌డం ప‌ట్ల ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గాంధీ, నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన 5వ వ్య‌క్తిగా రాహుల్ గాంధీ నిలుస్తార‌న్నారు. దేశానికి రాహుల్ సేవ‌లు అవ‌స‌ర‌మ‌ని, 2019లో కాబోయే ప్ర‌ధాని రాహుల్ గాంధీయేన‌ని అన్నారు. రాహుల్ గాంధీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన 13 ఏళ్ల త‌రువాత ఏఐసీసీ అధ్య‌క్ష పీఠంపై కూర్చుంటున్నార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ అమేథీ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా ఉన్నార‌ని వివ‌రించారు. రాహుల్ గాంధీకి తాము శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.
raghuveera reddy
rahul gandhi
apcc

More Telugu News