manmohan singh: ప్ర‌ధాని మోదీ ఆరోప‌ణ‌ల‌పై మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఆగ్ర‌హం!

షార్ట్స్‌లో చూడండి
గుజరాత్ ఎన్నికల నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ నేత‌లు పాక్‌ అధికారులతో చర్చించినట్లు ప్రధాని మోదీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై స్పందించిన‌ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్... రాజకీయ లబ్ధి కోసం మోదీ ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఈ ఆరోపణలు తనను చాలా బాధించాయని అన్నారు. ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని మండిప‌డ్డారు.

ఇటీవ‌ల మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ ఇచ్చిన విందులో గుజ‌రాత్ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించ‌లేదని స్ప‌ష్టం చేశారు. తాము కేవలం ఇండోపాక్ సంబంధాల గురించి మాత్రమే చర్చించామ‌ని స్ప‌ష్టం చేశారు. మోదీ ఈ విష‌యంపై క్ష‌మాప‌ణ‌లు చెప్పి ప్రధాని కార్యాలయ హుందాతనాన్ని కాపాడాల‌ని అన్నారు. 
Go Back to Shorts
manmohan singh
Narendra Modi
Congress

More Telugu News